అంగన్వాడీల ఆక్రనందన..

Dec 14,2023 14:41 #Kurnool
  • మూడురోజులుగా చంటిబిడ్డలతో సమ్మెలో
  • ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేదాక ఉద్యమం ఆగదని హెచ్చరిక
  • నాటి ప్రభుత్వాలు దిగొచ్చి డిమాండ్లు నెరవేర్చాయి
  • అంగన్వాడీల స్థానాల్లో వాలుంటార్ల తో పనులు మొదలు పెట్టమంటున్న ప్రభుత్వం

ప్రజాశక్తి కర్నూలు అగ్రికల్చర్ : కార్మిక,కర్షక,రైతాంగ పీడిత ప్రజల అభివృద్ధి నిరుద్యోగులు, ఉద్యోగుల సంరక్షణ రాష్ట్ర భవిష్యత్ కు మేము గ్యారంటీ అని పదువుల్లోకి రాకముందు రాజకీయ పార్టీల హామీలు గాలిలో దూళీల మారిపోతున్నాయి.వైసిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పను మెడిమ తిప్పను అని వాగ్దానాలు ఇచ్చిన ఆయన అన్ని నీటిమూటలు అయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అంగన్వాడీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కంటే వేయి రూపాయలు అదనంగా ఇస్తానని ఇప్పుడు ఇచ్చే వేతనం కూడా సరిగా ఇవ్వడం లేదని వేతనం ఇవ్వకపోగా అధిక ఒత్తిళ్ళు పనిభారం తో అంగన్వాడీలు సమ్మె సైరన్ మోగించారు.గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్లారు.కర్నూలు నగరంలోని ధర్నా చౌక్ లో అంగన్వాడీల ధర్నా మూడవరోజుకు చేరుకుంది.చంటి బిడ్డలను తీసుకుని ఎండను సైతం లెక్క చేయకుండా సమ్మెలో పాల్గొంటున్నారు అంగన్వాడీలు.

గర్భిణీలకు పిల్లలకు పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ సెంటర్లను ఏర్పాటు చేశారు.అలాంటి సెంటర్లలో టీచర్లు గా ఆయాలుగా పని చేస్తున్న వారికి కనీస వేతనం 26 వెలు ఇవ్వాలని పని భారాన్ని తగ్గించాలని రకరకాల యాప్ లతో ఒత్తిళ్లు ఉన్నాయని వాటిని అన్ని ఒకే యాప్ గా తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం కంటే వేయి రూపాయలు ఎక్కువ ఇస్తామన్న వేతనం కూడా ఇవ్వలేదని తదితర డిమాండ్ల సదనకై ఈ నెల 12 నుండి అంగన్వాడీలు సమ్మె లోకి వెళ్లారు.ఈ సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు మూసివేయబడ్డాయి.న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చడం మానేసి అంగన్వాడీలు సమ్మె ముగిసే దాకా ఆ స్థానంలో వాలింటర్లుతో పని చేయించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం మరింత అగ్గిరాజేసింది.తాళం వేసిన సెంట్లను పగలకొట్టి కొత్త తాళం వేయాలని సమ్మె విరమించి విధుల్లోకి రావాలని అధికారుల ద్వారా ప్రభుత్వం ఒత్తిళ్లు చేస్తుందని ఎన్నిరకల ఒత్తిళ్లు చేసిన సమ్మె విరమించడం కుదరదని బీష్మించుకు కూర్చున్నారు అంగన్వాడీలు.నాటి ప్రభుత్వాల్లో చంద్రబాబు నాయుడు ,కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రభుత్వం దిగొచ్చి డిమాండ్లు నెరవేర్చారని వైసిపి ప్రభుత్వం కూడా డిమాండ్లు నెరవేర్చేదాక విరమించడం జరగదంటున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక లక్ష ఇరవై వేల మంది అంగన్వాడీలు ఉన్నారు.కర్నూలు నగరంలో రోజుకు 1400 మంది అంగన్వాడీలు సమ్మెలో పాల్గొంటున్నారు.రాష్టంలో ఎక్కడ కూడా అంగన్వాడి సెంటర్లు పని చేయడంలేదు.గత ప్రభుత్వాలు గుర్రాలతోతొక్కించిన సమ్మె విరమించలేదు వెనకడుగు వేయలేదు. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిన సమ్మెను విరమించడం కుదరదని డిమాండ్ల సాదనకై ఎలాంటి పోరాటాలు అయిన చేస్తామని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తుందా లేదా సమ్మె మరింత ఉదృతం చేసి అంగన్వాడీల డిమాండ్లు సాదించుకుంటారా అనేది ప్రస్తుత పరిస్థితులుఉన్నాయి.

చేతకాని వాగ్దానాలు ఎందుకు చేశారు : పి.నిర్మల అంగన్వాడీల జిల్లా గౌరవాధ్యక్షురాలు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతకాని వాగ్దానాలు ఎందుకు చేశారు.అప్పుడే చేతకదాని చెప్పాల్సింది.తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తాను అని వేతనం ఇవ్వకపోగా అనవసర యాప్ లను పెట్టారు.నాటి ప్రభుత్వాలుగుర్రాలతో తొక్కించిన వెనక్కు తగ్గలేదు. ఎలాంటి పోరాటాలకు అయిన సిద్ధం .వాలింటర్ల తో పని చేయిస్తాం అని ప్రకటించడం దుర్మార్గమైన చర్య ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బయపడం డిమాండ్లు నెరవేర్చే దాకా పోరాటం ఆగదు.మరింత ఉదృతం చేస్తాం.

అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలి : చంద్ర శేఖర్ .ఎఐటియుసి నగర కార్యదర్శి

అంగన్వాడీలు చేస్తున్న సమ్మె కు ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు ఉంటుంది.వారి న్యాయమై డిమాండ్లు నెరవేర్చేదాక అండగా ఉంటాం.ప్రభుత్వం దిగొచ్చేదాక సమ్మె విరమించడం జరగదు.చంటి బిడ్డలను ఎత్తుకుని సమ్మెలో పాల్గొంటున్నారు అంగన్వాడీలు. అలాంటి వారి ఆక్రనందన ప్రభుత్వం విని పరిష్కరించాలి.

➡️