బెదిరింపులకు భయపడేది లేదు.. తేల్చి చెప్పిన అంగన్వాడీలు

ప్రజాశక్తి-మాడుగుల(అనకాపల్లి) : న్యాయపరమైన సమస్యలపై పోరాడుతున్న అంగన్వాడీలకు నోటీసులు వచ్చాయంటూ ఎన్ని బెదిరింపులు వచ్చిన భయపడేది లేదని తేల్చి చెప్పారు. మంగళవారం మాడుగులలో రెండు మండలాలు సంబంధించి అంగన్వాడీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సమ్మెను నిలిపివేయాలని మీకు నోటీసులు వచ్చాయి అంటూ సమ్మెలో పాల్గొన్న అనేకమందికి ఫోన్లు వస్తున్నాయని అయినప్పటికీ మేము భయపడేది లేదని మాడుగుల, చీడికాడ ప్రాజెక్ట్‌ అంగన్వాడీ నాయకులు డి.పార్వతి చెప్పారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామని లేనట్లయితే ముందుకు పోవడమే గాని వెనుకడుగు వేసేది లేదంటూ వారు తెలిపారు. అంతేకాకుండా అంగన్వాడి నాయకులు వి ధనలక్ష్మి, ఆర్‌ రామలక్ష్మి, డి పార్వతి లు మాట్లాడుతూ రేపు అనకాపల్లి కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

➡️