సిఎం జగన్‌ మనసు మారాలని అంగన్వాడీల ప్రార్థనలు

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌(అన్నమయ్యజిల్లా) : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మనసు మారి తమ న్యాయమైన కోర్కెలు తీర్చే విధంగా ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ అంగన్వాడీ మహిళలు ఏసుప్రభుకు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అంగన్వాడీల 14వ రోజు సమ్మెలో భాగంగా క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్‌ ఆధ్వర్యంలో ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద కేకు కోసి, ప్రార్థనలు చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఈశ్వరమ్మ, శివరంజని, సుజాత, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️