డిమాండ్లను పరిష్కరించాలి.. అంగన్వాడీలు మౌన ప్రదర్శన ర్యాలీ

Dec 23,2023 15:02 #ananthapuram, #Anganwadi strike

ప్రజాశక్తి-కదిరి అర్బన్‌(అనంతపురం) : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీల చేపట్టిన సమ్మె 12వ రోజు చేరుకుంది. శనివారం ఆర్‌అండ్‌బి నుండి నోటికి నల్ల రిబ్బన్‌ కట్టుకొని కాలేజ్‌ సర్కిల్‌, అంబేద్కర్‌ సర్కిల్‌ మీదగా మున్సిపల్‌ కార్యాలయం వరకు మౌన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూకనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. మినీ అంగన్వాడి కేంద్రాలను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకురాళ్లు చంద్రకళ, సుశీల, రామలక్ష్మమ్మ, శారదా, ప్రమీల, లక్ష్మీదేవి సిఐటియు నాయకులు జి.ఎల్‌. నరసింహులు, బాబ్జాన్‌, రామ్మోహన్‌, విజయ్ పాల్గొన్నారు. స్టూడెంట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాకే హరికుమార్‌ మద్దతు ప్రకటించారు.

➡️