వంటా వార్పుతో నిరసన తెలిపిన అంగన్వాడీలు

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌(అన్నమయ్యజిల్లా) : డిమాండ్ల సాధన కోసం గత ఎనిమిది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు వివిధ రూపాలలో నిరసన తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ఎనిమిదవ రోజు మంగళవారం స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో వంటా-వార్పు కార్యక్రమం ద్వారా వినూత్నంగా నిరసన తెలిపారు. డిమాండ్లు నెరవేర్చవరకు ఉద్యమం ఆగదని ఈ సందర్భంగా అంగన్వాడీలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్‌, అంగన్వాడీ వర్కర్లు రమాదేవి, సుజాత, ఈశ్వరమ్మ, శివరంజిని, విజయ, అమరావతి తదితరులు పాల్గొన్నారు.

➡️