వయోవృద్ధులకు ఒక వరం ఫ్యామిలీ ఫిజీషియన్ 

Mar 10,2024 10:47 #Annamayya district
A boon for the elderly is the family physician

ప్రజాశక్తి- కలకడ: వయోవృద్ధులకు ఫ్యామిలీ ఫిజీషియన్ ఒక వరం లాంటిదని వైద్యాధికారి ఎన్ వి కిషోర్ కుమార్ రెడ్డి కొనియాడారు, ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రo డాక్టర్ ఎం. వి.కిషోర్ కుమార్ రెడ్డి. ఆధ్వర్యంలో ఫ్యామిలీ పిజిషన్ కార్యక్రమం జరిగినది. ఈ ఫ్యామిలీ పిజిషన్ కార్యక్రమంగురించి వైద్యాధికారి మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులు మరియు అసంక్రమణ వ్యాధులు అధిక రక్తపోటు షుగర్ వ్యాధులకు. హాస్పిటల్ కి వెళ్లలేని వారికి చిన్నపిల్లలు గర్భవతులు ఫ్యామిలీ ఫిజీషియన్ ఎంతో ఉపయోగపడుతుందని వారు క్రమము తప్పకుండా మంచి మందులు ఇస్తామని బాగా ఉపయోగపడుతుందని తెలిపినారు. కలుషిత ఆహారము నీరు వాటి వల్ల వచ్చే వ్యాధుల గురించి వివరించారు. ప్రతి గృహంలో జ్వరములు దగ్గు జలుబులు అలాగే పరిసరాల పరిశుభ్రత లార్వా సర్వేలు నిర్వహించాలి. గర్భవతులు బాలింత సంరక్షణ వ్యాక్సినేషన్ టీకాల కార్యక్రమాన్ని నూరు శాతం సాధించాలని వైద్యాధికారి గారు ఆదేశించారు. వేసవికాలంలో వచ్చే డయేరియా. వడదెబ్బ తీసుకోవలసిన జాగ్రత్తలను 05 సం.లోపల పిల్లలు మరియు 50 సం. పైబడిన వారు ఉదయం 10 గం లోపల ప్రతి ఒక్కరు ఇల్లు చేరుకోవాలని వడదెబ్బ నుంచి రక్షణ పొందాలని గ్రామాలలో ఓ.ఆర్.ఎస్. క్యాంప్స్ & కార్నర్లు పెట్టాలని వడదెబ్బకు కావలసిన మందులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి తీసుకెళ్లాలని వైద్యాధికారి గారు ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎం.పీ.హెచ్.ఈ.ఓ. జి. జయరామయ్య ఆరోగ్య కార్యకర్త సి.లక్ష్మీదేవి డి. వరలక్ష్మి. డేటా ఎంట్రీ ఏ. రోజా ఫైలట్ ఏ రమేష్ బాబు ఆశా కార్యకర్తలు కె. అమరావతి పాల్గొన్నారు.

➡️