టైక్వాండోలో సత్తా చాటిన అన్నమయ్య అకాడమీ క్రీడాకారులు

Jan 11,2024 12:05 #Annamayya district
sports news

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఈనెల 10వ తేదీన ప్రొద్దుటూరులో జరిగిన 37వ జిల్లా స్థాయి టైక్వాండో పోటీలలో రాజంపేట టైక్వాండో అన్నమయ్య అకాడమీ క్రీడాకారులు ఎనిమిది మంది పతకాలు సాధించి సత్తా చాటారని మాస్టర్ పిచ్చయ్య తెలియజేశారు. గురువారం అన్నమయ్య అకాడమీలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు అభినందన సభ ఏర్పాటు చేసి వారికి జ్ఞాపికలు, పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా పిచ్చయ్య మాట్లాడుతూ కె.వి వినయ్ కుమార్ రజక పతకం, జయదీప్, అన్విత, జకియా, జోహెబ్, ఉమర్, ఆర్.వి బద్రి లు కాంస్య పతకాలు సాధించారని తెలిపారు. తమ అకాడమీ నుంచి క్రీడాకారులు పథకాలు సాధించడం పట్ల కోచ్ లు జాహిద్ అలీ, జ్ఞాన సాయి, క్రీడాకారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

➡️