దోమల నివారణ పై అవగాహన

Jun 20,2024 15:35 #Annamayya district, #mosquito

ప్రజాశక్తి- కలకడ: దోమల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించినట్లు ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యం.వి.కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మలేరియా మాషోత్సవ కార్యక్రమం జరిగినది. కార్యక్రమం గురించి వైద్యాధికారి మాట్లాడుతూ గ్రామంలో నీటి నిలువలు లేకుండా చేసుకోవాలని పాత టైర్లు. పాత కూలర్లు. ప్లాస్టిక్ డబ్బాలు. టెంకాయ బొచ్చలలో నీరు నిలువ లేకుండా చేసుకోవాలని సాయంత్రం ఆరు తర్వాత గృహములో కిటికీలు తలుపులు మూసుకోవాలని వేపాకు పొగను ప్రతి ఇంట్లో పొగ పెట్టడం వలన దోమలు పూర్తిగా బయటకు వెళ్లిపోతాయని వైద్యాధికారి తెలియజేశారు.సబ్ యూనిట్ అధికారి షేక్ ముజేబ్ బాషా మాట్లాడుతూ నీటి తొట్టెలు కొబ్బరి చిప్పలు వాడిపడేసిన ప్లాస్టిక్ వస్తువులు నీళ్ల డ్రమ్ములు ఈరోజు ఆరోజు శుభ్రపరచుకోవాలని ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలని (దోమ నాలుగు దశలలో తయారవుతుందని గుడ్డు దశ లార్వాదశ పీపాదశ దోమ దశగా ఈ నాలుగు దశలు తయారవుతుంది. దీనికి బట్టే కాలవ్యవధి ఏడు రోజులు దోమలు లక్షలు కోట్లు మిలియన్లు తయారవుతున్నాయి వివరించారు. విస్తరణ అధికారి జయరామయ్య మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఫ్రైడే రైడే లార్వా సర్వే ఫార్మేట్లు ఫిలప్ చేసి ఇవ్వాలని ఆబైట్ మందును పిచికారి చేయాలని రాండమ్ సర్వే కరెక్ట్ గా చేయాలని ఆరోగ్య కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు వివరించారు ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ షేక్ జమీల్ అహ్మద్ పి హెచ్ ఎన్ కే సుబ్బరత్నమ్మ. ఫార్మసిస్ట్ షేక్ షరీఫ్ బాషా ఆరోగ్య కార్యకర్తలు ఎం.ఎల్.హెచ్.పీలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️