‘మేము సిద్ధం’ సభకు సిద్ధం కండి

Feb 14,2024 10:57 #Annamayya district
Get ready for the 'we prepare' meeting

రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఇక్భాల్ అహ్మద్ ఖాన్
ప్రజాశక్తి-కలికిరి: మేము సిద్ధం సభను విజయవంతం చేయాలని ముస్లిం మైనార్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కలికిరి మండలం మహల్ గ్రామం నందు బుధవారం సాయంత్రం సర్పంచ్ తస్లీమా రియాజ్ ఆధ్వర్యంలో వైకాపా నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఇక్భాల్ అహ్మద్ ఖాన్ పాల్గొని మాట్లాడుతూ ఈనెల 18వ తారీఖున అనంతపురం జిల్లాలోని రాప్తాడు గ్రామంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే మేము సిద్ధం భారీ బహిరంగ సభకు ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముస్లింలకు వెన్నుదన్నుగా ఉంటూ సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను ముస్లిం మైనార్టీలకు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువనాయకులు జాహిద్ తదితరులు పాల్గొన్నారు.

➡️