ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం

Mar 4,2024 16:26 #Annamayya district

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ప్రజల ఆరోగ్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం రాజంపేట పట్టణంలోని ఈడిగ పాలెం వార్డులో రూ 80 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మేడ మల్లిఖార్జున రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, సంక్షేమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అన్నారు. సంక్షేమ ప్రదాత, నిత్య కృషివలుడు అయిన జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ రాంబాబు, వైస్ చైర్మన్ మర్రి రవి, వార్డు కౌన్సిలర్లు, మునిసిపల్ సిబ్బంది, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

➡️