ఘనంగా ముగిసిన వార్షిక స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌-2024

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖపట్నం సిటీ పోలీస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏన్యువల్‌ గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ – 2024 ముగింపు వేడులను సోమవారం సాయంత్రం పోలీస్‌ బేరక్స్‌ లోని ఆర్మూర్‌ రిజర్వ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ఎం.అంగముత్తు హాజరై విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ … ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా క్రీడలు నిర్వహించడం పోలీసు శాఖకు మానసికంగా, శారీరకంగా చాలా ముఖ్యమని అన్నారు. క్రీడల సందర్భముగా పది టీంలు ఎంతో బాగా డ్రిల్‌ చేశారని చెప్పారు. గెలుపు ఓటములు క్రీడలలో భాగమని, వాటిలో పాలుపంచుకోవడం ముఖ్యమని తెలిపారు, నగర పోలీసు శాఖ నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలలో పతకాలు సాధించడం ఎంతో గొప్పవిషయమన్నారు. నగర పోలీసులలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ను పెంపొందించడానికి, ఇప్పటికంటే మరింత మెరుగు పరుచుకోవడానికి నగర పోలీసులకు తమ నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేశారు. అదేవిధముగా సాంకేతికంగా మరింత నూతనముగా ఉండేందుకు కావలసిన సహకారాలను అందిస్తామని తెలిపారు.

నగర పోలీస్‌ కమిషనర్‌ ఏ.రవి శంకర్‌, ఐ మాట్లాడుతూ … క్రీడలు మన సంస్కఅతిలో ఉండాలన్నారు. ఫిజికల్‌ ఫిట్‌ నెస్‌ ప్రాముఖ్యత ఏమిటో అందరికీ తెలుసునని.. మనలో కూడా పరవాడ కఅష్ణ లాంటి కానిస్టేబుల్‌, పలుమార్లు అంతర్జాతీయ స్థాయిలో ఐరన్‌ మ్యాన్‌ టైటిల్‌ గెలుచుకోవడం జరిగినదన్నారు. యోగా లో ఒక మహిళా సిఐ పలు టైటిల్స్‌ గెలుచుకున్నారని గుర్తు చేశారు. అయితే ఈ స్పోర్ట్స్‌మీట్‌ ముఖ్యమైన సందేశం ఉద్యోగం , కుటుంబముతో పాటూ ఫిట్‌నెస్‌ సంస్కఅతిని అలవరుచుకోవడం అని తెలిపారు. ఈ వార్షిక స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ వద్ద మొత్తం 10 టీమ్‌ (వెస్ట్‌ సబ్‌-డివిజన్‌, ట్రాఫిక్‌ డివిజన్‌, సౌత్‌ సబ్‌-డివిజన్‌, నార్త్‌ సబ్‌-డివిజన్‌, హార్బర్‌ సబ్‌-డివిజన్‌, ఈస్ట్‌ సబ్‌-డివిజన్‌, బ్యాండ్‌ టీమ్‌, ద్వారకా సబ్‌-డివిజన్‌, క్రైమ్‌ సబ్‌-డివిజన్‌, సిటీ ఆర్ముడ్‌ రిజర్వ్‌) లు పాల్గన్నాయి. ఈ ముగింపు కార్యక్రమంలో డి.సి.పి-1(ఎల్‌ అండ్‌ ఓ) వి.ఎన్‌.మణికంఠ చందోలు, , డి.సి.పి-02 (ఎల్‌ అండ్‌ ఓ) యం.సత్తిబాబు, డి.సి.పి(క్రైమ్స్‌) పి.వెంకటరత్నం, ఏడీసిపి లు,ఏసిపి లు, సీఐ లు, ఆర్‌ఐ లు, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

➡️