ఎన్‌టిపిసికి అపెక్స్‌ ఇండియా ప్లాటినం అవార్డు

అవార్డు అందుకుంటున్న ఎన్‌టిపిసి సింహాద్రి డిజిఎం మహాపాత్రో

ప్రజాశక్తి-పరవాడ

ఎన్టీపీసీ సింహాద్రి 2023 సంవత్సరానికి అపెక్స్‌ ఇండియా ఫౌండేషన్‌ ద్వారా అందించబడిన సిఎస్‌ఆర్‌ ఎక్సలెన్స్‌ విభాగంలో ప్రతిష్టాత్మకమైన ప్లాటినం అవార్డును సాధించింది. ఈనెల 4వ తేదీన ఢిల్లీలో జరిగిన వేడుకలో ఎన్‌టిపిసి సింహాద్రి యానిట్‌ తరపున డీజీఎం హెచ్‌ఆర్‌ మహాపాత్ర ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధి, స్థిరమైన పద్ధతుల పట్ల ఎన్టిపిసి సింహాద్రికి ఉన్న నిబద్ధతను ఈ ప్రశంస హైలైట్‌ చేస్తుందన్నారు. అపెక్స్‌ ఇండియా ఫౌండేషన్‌ వివిధ పరిశ్రమలలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు ప్రసిద్ధి చెందిందని చెప్పారు. శ్రేష్టమైన కార్యక్రమాలు, విజయ నమూనాలను హైలైట్‌ చేయడం ద్వారా స్థిరమైన, సామాజిక బాధ్యత గల పద్ధతులను అవలంబించేలా సంస్థలను ప్రోత్సహించడం దీని లక్ష్యమని తెలిపారు. ఎన్టిపిసి సింహాద్రి విజయవంతమైన కార్యక్రమాలు ముఖ్యంగా విద్య, పర్యావరణ సుస్థిరత, ఆరోగ్యం, సంరక్షణ కార్యక్రమాలపై దృష్టి సారించి చుట్టుపక్కల కమ్యూనిటీలలో జీవన నాణ్యతను మెరుగుపరిచాయని చెప్పారు. ఈ ప్రయత్నాలు ఎన్టిపిసి సింహాద్రి నిర్వహిస్తున్న కమ్యూనిటీలకు మద్దతివ్వాలనే నిబద్ధతతో పనిచేస్తున్నట్లు తెలిపారు.

➡️