విద్యార్థులకు ప్రశంసా పత్రాలు

Jun 20,2024 20:51

 ప్రజాశక్తి – పార్వతీపురం : పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను ఆర్‌డిఒ హేమలత గురువారం బహూకరించారు. కొమరాడలోని కెజిబి విద్యాలయానికి ”మై స్కూల్‌ మై ప్రైడ్‌” ప్రోగ్రాంలో భాగంగా ప్రత్యేక అధికారిగా వ్యవహరించారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్ఫూర్తిని నింపుతూ ప్రశంసా పత్రాలను బహూకరించారు. బహుమతులను అందుకున్న వారిలో హిమరిక మానస, తెలికి లావణ్య, బొజ్జ రాధిక, రాయగడ హేమలత, బిడ్డిక చిన్నారి ఉన్నారు. విద్యార్థులు ఇలాగే చదువుతూ ఉన్నత చదువులు, హౌదాలు అందుకోవాలని ఆర్‌డిఒ ఆకాంక్షించారు.

➡️