పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

ప్రజాశక్తి-రాయచోటి సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతా వరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరే ట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో సాధారణ ఎన్నికల నిర్వహణపై విలేకరుల సమావేశం నిర్వహిం చారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజక వర్గాలలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. నామినేషన్లకు సంబంధించి రాజంపేట పార్లమెంటులో 18 మంది అభ్యర్థులు, రాజంపేట అసెంబ్లీకి సంబంధించి 12 మంది, కోడూరు 15 మంది, రాయచోటి 15 మంది, తంబళ్లపల్లె 11మంది, పీలేరు12 మంది, మదనపల్లె 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. అభ్యర్థులను బేస్‌ చేసుకుని బ్యాలెట్‌ పేపర్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లు తయారు చేస్తున్నట్లు తెలిపారు. జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు బరిలో ఉన్న అభ్యర్థులందరికీ ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు తెలియజేశామని అన్నారు. ఇసి నుంచి జిల్లాకు ముగ్గురు ఎక్సెండిచర్‌ అబ్జర్వర్లు, ఇద్దరు జనరల్‌ అబ్జర్వర్లు, ఒక పోలీస్‌ అబ్జర్వర్‌ జిల్లాకు వచ్చారని అన్నారు. జిల్లాలో మొత్తం 1609 పోలింగ్‌ స్టేషన్‌లు ఉన్నాయని అన్ని పోలింగ్‌ స్టేషన్‌ లలో ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఎర్రచందనం సంపదను ఒక థీమ్‌గా తీసుకొని ప్రతి మండలంలో ఒక మోడల్‌ పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలందరూ ఓటింగ్‌ లో పాల్గొని ఈసారి 85 శాతం ఓట్లు పోలయ్యే విధంగా ఓటర్లందరూ తమ ఓటు హక్కును విని యోగించుకోవాలన్నారు. పార్లమెంటు పరిధిలో విభిన్న ప్రతిభావంతులతకు రెండు, మహిళలకు రెండు ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 856 మంది 85 సంవత్సరాలు పైబడిన వారికి హోమ్‌ ఓటింగ్‌ సౌకర్యం కల్పించామని, హోమ్‌ ఓటింగ్‌ మే 3 వ తేదీన మొదలుపెట్టి మూడు, నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. 11న అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలు ఆపివేయడం జరుగుతుందని 11వ తేదీ నుంచి ఎటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదని సూచించారు. 2వ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గంలో బిఎల్‌ఒ ద్వారా ఓటర్‌ స్లిప్పులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించడం జరుగుతుందని ప్రజలు ఎండ తీవ్రతను దష్టిలో ఉంచుకొని ఓటర్లందరూ తప్పకుండా ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

➡️