క్వారీ తవ్వకాలను పరిశీలించిన ఎఎస్‌పి

May 22,2024 20:44

 ప్రజాశక్తి -సీతానగరం :  మండలంలోని విప్పలవలస, నిడగల్లు, మరిపివలస, సూరమ్మపేట వద్ద గల క్వారీలను అడిషనల్‌ ఎస్‌పి సునీల్‌షరోనా బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా క్వారీ యజమానులతో మాట్లాడుతూ లీజులు అనుమతులను అడిగి తెలుసుకున్నారు. క్వారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. క్వారీలో మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సిఐ రవికుమార్‌, ఎస్‌ఐ రాజేష్‌ పాల్గొన్నారు.

➡️