బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు

Apr 5,2024 22:30
ఫొటో : జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న టిడిపి నాయకులు

ఫొటో : జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న టిడిపి నాయకులు
బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు
ప్రజాశక్తి-వరికుంటపాడు : వరికుంటపాడు మండల టిడిపి కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకలను శుక్రవారం మండల కరీంనగర్‌ చండ్ర మధుసూదన్‌ రావు ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం మండల కన్వీనర చండ్ర మధుసూదన్‌ రావు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నత కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసిన జగ్జీవన్‌రామ్‌ను మరువలేమన్నారు. ఆయన అడుగుజాడలో నడిచి ప్రతి ఒక్కరూ ఆయనను గుర్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌సిసెల్‌ అధ్యక్షులు తాతపూడి లాబాన్‌, బిసిసెల్‌ అధ్యక్షులు కొండల్‌ యాదవ్‌, టిడిపి నాయకులు, బాల గురువారెడ్డి, శ్రీకాంత్‌ యాదవ్‌, తెల్లగొర్ల వెంకటయ్య, శివరామిరెడ్డి, మాలకొండ రాయుడు, నూనె ప్రసాద్‌, సుకుమార్‌, నందిపాటి ఆరోణ్‌, కొనిగిపో వెంగయ్య, డేవిడ్‌, నూతలపాటి వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ఎంపిడిఒ కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి ఎంపిడిఒ తోట వెంకటకృష్ణ కుమారి పూలమాలవేసి నివాళులర్పించారు. మండలంలోని తూర్పు చన్నంపల్లి గ్రామంలో ఆదర్శ సేవా సంస్థ అధినేత బక్క ఆదయ్య జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.

➡️