చేనేత కార్మికులకు రాట్నాలు పంపిణీ

Jan 12,2024 00:12

ప్రజాశక్తి – భట్టిప్రోలు
కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు మంజూరైన మర రాట్నాలు, స్టాండ్ మగ్గాలను గురువారం పంపిణీ చేశారు. మండలంలోని ఐలవరంలో ప్రభుత్వం నుండి మంజూరైన పరికరాలను 250మంది చేనేత కార్మికులకు మంత్రి డాక్టర్‌ మేరుగ నాగార్జున, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు చేతుల మీదగా అందజేశారు. మంత్రి నాగార్జున మాట్లాడుతూ చేనేత రంగ అభివృద్ధికి జగన్మోహన్‌రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ నుండి సిఎం జగన్మోహన్‌రెడ్డి వరకు చేనేతల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కాలానికి అనుగుణంగా చేనేత కార్మికులు నూతన వస్త్ర తయారీ డిజైన్లపై మక్కువ చూపాలని అన్నారు. దీనిలో భాగంగానే మోటార్‌తో నడిచే రాట్నలు, స్టాండ్ మగ్గాలు అందజేశారు. జౌలి శాఖ ఆధ్వర్యంలో అందజేసిన పరికరాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైసిపి ఇన్చార్జి వరికూటి అశోక్ బాబు, బాపట్ల అభివృద్ది కమిటి చైర్మన్ మల్లికార్జునరావు, సర్పంచ్ మాచర్ల కోటేశ్వరావు, ఎంపీపీ డివి లలిత కుమారి, జెడ్పిటిసి ఉదయభాస్కరి, ఎంపీటీసీ మురుగుడు శ్రీనివాసరావు, నాయకులు బాలాజీ, మల్లేశ్వరరావు, హేమ సుందరావు పాల్గొన్నారు.

➡️