రభీ సీజన్‌కు ఈ క్రాప్ నమోదు

Jan 13,2024 00:53

ప్రజాశక్తి – భట్టిప్రోలు
ఈ ఏడాది రభీ సీజన్‌కు రైతులు సాగుచేసిన వివిధ రకాల పంటలను ఈ క్రాపు నమోదు చేయించుకోవాలని ఎఒ గొల్లపోతు వీరయ్య సూచించారు. ఎంపీపీ డివి లలిత కుమారి అధ్యక్షతన మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం శుక్రవారం నిర్వహించారు. మీరయ్య మాట్లాడుతూ రైతులకు ఈ క్రాపు నమోదు ఎంతో అవసరం అన్నారు. దీనిని గుర్తించి రైతులు తప్పనిసరిగా వ్యవసాయ సిబ్బందితో ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలని అన్నారు. మండల సలహా మండలి చైర్మన్ కుందేటి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా వివిధ రకాల సంక్షేమ పథకాలను రైతులకు అందజేస్తుందని అన్నారు. పంట నమోదు లేకపోతే అన్ని విధాల రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఆ గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సిబ్బంది ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉండి తగిన సలహాలు సూచనలు అందించాలని పేర్కొన్నారు. ఎంపీపీ డివి లలిత కుమారి మాట్లాడుతూ రభీ సీజన్లో రైతులు సాగు చేసిన పంటలకు చీడపీడలు ఆశించకుండా రైతులకు తగిన సలహాలు సూచనలు అందిస్తూ అందుబాటులో ఉండాలని అన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి ఉదయభాస్కరి, వివిధ గ్రామాల విఎఎలు ఉన్నారు.

➡️