సెంట్రల్ లైటింగ్ ప్రారంభం

Jan 21,2024 00:36

ప్రజాశక్తి – రేపల్లె
పట్టణంలోని 9వ వార్డులో రూ.20లక్షల నిధులతో అన్నిహంగులతో రూపుద్దిద్దుకున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పార్కును, ఓల్డ్‌ టౌన్‌లో రూ.18లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగును శనివారం రాత్రి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, వైసిపి ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఈపూరు గణస్త్రష్‌ ప్రారంభించారు. పని ఒత్తిడితో విసిగిపోయిన పెద్దలకు, వినోదం కోరుకునే చిన్నారులకు పార్కులు ఎంతగానో అహ్లాదాన్ని అందిస్తాయన్నారు. ఓల్డెటౌన్లో సుదీర్ఘకాలంగా ప్రజలు, ప్రయాణీకులు ఎదుర్కొంటున్న రహదారి సమస్య, రహదారిని విస్తరించి నిర్మించి శాశ్వత పరిష్కారం చూపామన్నారు. నేడు సెంట్రల్ లైటింగును ఏర్పాటు చేసిన ఒల్డ్ టౌన్లో వెలుగులు నింపి న్యూటౌన్‌గా రూపుదిద్దుతున్నామని అన్నారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి పార్కును ప్రారంభించారు. పార్కులో ఏర్పాటు చేసిన ఆక్వేరియం, పౌంటెన్, చెట్ల ఆకృతిలో ఉన్న జిరాఫీ, ఏనుగు, మొక్కలను పరిలించారు. కార్యక్రమంలో వుడా ఛైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, వైసీపీ నాయకులు గడ్డం రాధాకృష్ణమూర్తి పాల్గొన్నారు.

➡️