నేడు ముక్కోణపు సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ

Feb 11,2024 22:38

ప్రజాశక్తి – చీరాల
స్థానిక ముక్కోణం పార్కు సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు అందరూ ఆహ్వానితులేనని వైసిపి ఇన్చార్జి కరణం వెంకటేష్ అన్నారు. మండలంలోని రామకృష్ణాపురం వైసిపి కార్యాలయంలో ఆయన విలేకరులతో ఆదివారం మాట్లాడారు. అంబేద్కర్ మహనీయులని అన్నారు. ఆయన ఆశయాసాధనకు అందరు కృషి చేయాలని అన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం శుభ పరిణామమని అన్నారు. విగ్రహ ఆవిష్కరణకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగామ సురేష్ హాజరైతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి చేతుల మీదగా విగ్రహావిష్కరణ చేస్తారని అన్నారు. ముక్కోణపు సెంటర్లో ఉన్న అంబేద్కర్ పాత విగ్రహాన్ని కొద్దిరోజుల క్రితం తొలగించి దానిని అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నూతన హంగులతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంసం విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం సోమవారం సాయంత్రం 4గంటలకు ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు, కౌన్సిలర్లు మించాల సాంబశివరావు, చీమకుర్తి బాలకృష్ణ, సల్లూరి సత్యానందం, గుంటూరు ప్రభాకరరావు, డాక్టర్ తాడివలస దేవరాజు, సల్లూరి అనిల్ పాల్గొన్నారు.

➡️