చేతుల శుబ్రతపై చిన్నారులకు శిక్షణ

ప్రజాశక్తి – పంగులూరు
సీజనల్‌గా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐసిడిఎస్ ముప్పవరం సెక్టార్ సూపర్వైజర్ పద్మజ అన్నారు. డయేరియా నిర్మూలనలో భాగంగా గ్రామంలోని మూడు అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో చిన్నారులకు చేతుల పరిశుబ్రతపై అవగాహన కల్పించారు. సీజనల్‌గా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వాటి నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. భోజనం చేసే ముందు, చేసిన తర్వాత కూడా చేతులను శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. సూక్ష్మజీవులను దరిచేరినీయకుండా చేసేందుకు వివిధ రకాల చర్యలు తీసుకోవాలని అన్నారు. పిల్లలను ఆరోగ్యంగా ఉంచాలని అన్నారు. వారి ఆరోగ్యం పట్ల తల్లులు జాగ్రత్త వహించాలని కోరారు. పిల్లలు పలుచోట్ల ఆటలాడి దుమ్ము, ధూళితో ఉన్న చేతులతో ఉంటారని అన్నారు. వాటిని సబ్బుతో శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే భోజనం పెట్టాలని అన్నారు. పిల్లలకు పుష్టికరమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని కోరారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో అంగన్‌వాడి కార్యకర్తలు టీ ప్రసన్న, ఐ .శ్రీలక్ష్మి, పి సుధారాణి, బి శ్యామల, ఆయాలు జ్యోతి, సిహెచ్ ఆమని, సిహెచ్ ప్రసన్నలక్ష్మి, కె రేణుక పాల్గొన్నారు.


చెరుకుపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేతుల పరిశుభ్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సర్వ శిక్ష అభియాన్ ఎఎంఓ డాక్టర్ బిల్లా మోజేష్ తెలిపారు. స్థానిక గుల్లపల్లి జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు. చెరుకుపల్లి, పిట్టలవారిపాలెం, కర్లపాలెం మండలాల పరిధిలో ఎంపిక చేసిన 103పాఠశాలల పరిధిలోని ఉపాధ్యాయులకు డెటాల్ బనేగా ఇండియా, సర్వ శిక్ష అభియాన్ సంయుక్తంగా శిక్షణ నిర్వహించారు. ఎంఈఓ పులి లాజర్ అధ్యక్షత వహించారు. ఎస్‌ఎస్‌ఎ ఎఎంఓ డాక్టర్ బిల్లా మోజేష్ చేతులు పరిశుభ్రతపై ఉపాధ్యాయులకు శిక్షణ, అవగాహన కల్పించారు. విద్యార్థులు ఆటలు ఆడిన తర్వాత, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత, భోజనం చేసే ముందు, చేసిన తర్వాత తీసుకోవాల్సిన చర్యల పట్ల వాల్ రేటింగ్స్ ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన మెటీరియల్‌పై అవగాహన కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ టి నవీన్ కుమార్, పాఠశాల హెచ్‌ఎం కవిత, రిసోర్స్ పర్సన్లు రవిరాజు, డేటాల్ బనేగా స్వస్థ ప్రతినిధులు భగవాన్, నలిని, ఉపాధ్యాయులు కాటూరు నాగేశ్వరరావు, ఎల్ చక్రపాణి, కుంచ రామ్మోహనరావు పాల్గొన్నారు.

➡️