ఘనంగా అంబేద్కర్ 67వ వర్ధంతి

Dec 7,2023 00:44

ప్రజాశక్తి – రేపల్లె
డాక్టర్‌ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా సిపిఎం కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీపీఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడారు. దేశానికి ఘనమైన రాజ్యాంగాన్ని ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అవుతున్నాయని అన్నారు. బిజెపి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నదని అన్నారు. నిజంగా రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన కార్మికులు, మహిళలు హక్కులు ఆమలు జరగటం లేదన్నారు. రాజ్యాంగ బద్దంగా పరిపాలన చేయడమే అంబెడ్కర్‌కు నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కె ఆశీర్వాదం, వి లక్ష్మణరావు, వై నవీన్, డి శ్రీనివాసరావు, జె ధర్మరాజు, కె రమేష్ పాల్గొన్నారు.


అద్దంకి : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంశ్య విగ్రహం వద్ద ఏపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీస్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడని అన్నారు. అందరికి సమాన హక్కులు అందేలా, సమసమాజ స్థాపనే ధ్యేయంగా రాజ్యాంగాన్ని ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిర్మించారని అన్నారు. కార్యక్రమంలో విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, సందిరెడ్డి శ్రీనివాసరావు, మేదరమెట్ల మాజీ సర్పంచ్ జజ్జర ఆనందరావు, ఎస్బిఐ విశ్రాంత, వడ్డీముక్కల నాగేశ్వరరావు, కట్టా నాగేశ్వరరావు, అంకం నాగరాజు, చెన్నుపల్లి నాగేశ్వరరావు, సయ్యద్ హుసేన్, భాష, ఖాసీం, బత్తుల చందు, రింకు, కొండా వీరాంజనేయులు, మంచు హనుమంతరావు, ఫణి, అజిల్, తిప్పబత్తిన శ్రీను పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు మల్లాది శ్రీనివాసరావు, సందిరెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు.


రేపల్లె : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా స్థానిక తాలూకా సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి జై భీమ్ భారత్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జై భీంరావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షులు దోవా రమేష్ రాంజీ మాట్లాడారు. రాజ్యాంగా ఆదేశిక సూత్రాలు దేశప్రజలందరికీ న్యాయం చేసేవిధంగా రూపందించారని అన్నారు. అంబేద్కర్‌కు మరణం లేదని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒకరు పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు మునిపల్లి సుబ్బయ్య, ఆయుబ్ ఖాన్, కాకుమాను గురు బ్రహ్మం, నల్లూరి వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, గోపి, ఎమ్మార్పీస్ నాయకులు పోలిమెట్ల నాగేశ్వరరావు, నేరుసు వెంకటరావు నాయుడు, కర్ర బాబురావు, గుజ్జర్లమూడి బాబు పాల్గొన్నారు.

➡️