ఆనందబాబు విస్తృత పర్యటన

Jan 1,2024 00:24

ప్రజాశక్తి – భట్టిప్రోలు
నియోజకవర్గంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆదివారం విస్తృతంగా పర్యటన చేశారు. జంపని గ్రామానికి చెందిన టిడిపి నాయకురాలు మన్నే లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమెను పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొల్లూరు మండలం అనంతరంలో టిడిపి సీనియర్ నాయకులు చిట్టినేని బాలగంగాధర్ తిలక్, అలపర్తి రాజారావు సస్మరణ సభలో పాల్గొన్నారు. అదే గ్రామానికి చెందిన బలిజేపల్లి చలమయ్య అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని పరామర్శించి సానుభూతిని తెలిపారు. బాపట్ల పార్లమెంటరీ టిడిపి ప్రచార కమిటీ చైర్మన్ నాగళ్ళ శ్రీధర్ దుర్గమ్మ మృతి చెందగా ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

➡️