కొమ్మమూరు కెనాల్‌కు జలకళ

Apr 11,2024 23:30 ##canel #Kommamuru #Karamchedu

ప్రజాశక్తి – కారంచేడు
కారంచేడు, చీరాల, పర్చూరు, వేటపాలెం, చినగంజాం మండలాల్లోని గ్రామాలకు తాగు, సాగునీటిని అందిస్తున్న కొమ్మమూరు కాలువ కృష్ణ జలాలతో గురువారం కళకళలాడుతోంది. నీటి పారుదల అధికారులు ముందుగా ప్రకటించిన విధంగా బుధవారం వేకువజాము నుంచే కృష్ణా కాలువకు తాగు నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి తాగునీటి అవసరాల నిమిత్తం 950క్యూ సెక్కుల నీటిని విడుదల చేశామని తెలిపారు. మండలంలో చిన్న, పెద్ద చెరువులు 16వరకు ఉన్నాయని ఎంపీడీఓ బి బాబూరావు, ఈఓపీఆర్డీ ఆర్ రమేష్ బాబులు ప్రజాశక్తికి తెలిపారు. మండలంలోని కుంకలమర్రు, కారంచేడు, స్వర్ణ, రంగప్పనాయుడు వారిపాలెం, ఆదిపూడి, తిమిడిదపాడు గ్రామాల చెరువులకు నీటిని నింపుకోవడానికి అవసరమైన పంపింగ్ చేసుకోవాలని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో తాగునీటి చెరువులకు అవసరమైన నీటిని నింపుకోవాలని చెప్పారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పంచాయితీ కార్యదర్శులు తాగునీటిపై శ్రద్ధ పెట్టి చెరువులు నింపే ఏర్పాట్లు చూడాలని అన్నారు. చీరాల ఎస్‌ఎస్‌ ట్యాంకుకూ నీటిని నింపుకోవాల్సి ఉంది.

➡️