రాజ్యాధికార దిశగా బీసీలు ఐక్యం కావాలి

Jan 7,2024 23:48

ప్రజాశక్తి- పంగులూరు
బీసీలు రాజ్యాధికారం దిశగా ఐక్యం చేసేందుకు బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తుందని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఫణితపు శ్రీనివాసాచారి పేర్కొన్నారు. స్థానికంగా ఆదివారం జరిగిన బీసీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు చేబ్రోలు రవిచంద్ర మండల కమిటీని నియమిస్తూ ప్రకటన చేశారు. నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా గోలి పూర్ణచంద్రరావు, మండల అధ్యక్షుడుగా కడియం శివయ్య, ప్రధాన కార్యదర్శిగా కందుల రామారావు, ఉపాధ్యక్షులుగా ఉల్లగంటి వలి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరు మల్లికార్జున, యువజన విభాగం అధ్యక్షులుగా పల్లపు గోపిని నియమిస్తూ పత్రాలను అందజేశారు.

➡️