బహుజనలకు రాజ్యాధికారమే లక్ష్యంగా బిఎస్పీ

Dec 7,2023 00:22

ప్రజాశక్తి – చీరాల
బహుజనలకు రాజ్యాధికారమే లక్ష్యంగా బిఎస్‌పి ఆవిర్భవించబడిందని బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి అన్నారు. స్థానిక బిఎస్పీ కార్యాలయంలో మాజీ ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ పచ్చ కళాధరరావు బిఎస్పీలో చేరారు. కళాధరరావు గతంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు. పదవీ విరమణ అనంతరం డాక్టర్ బిఆర్‌ అంబేద్కర్ సిద్ధాంతానికి అనుగుణంగా నడుస్తున్న ఏకైక పార్టీ బిఎస్‌పి అన్నారు. బహుజన రాజ్యాధికారం కోసం పనిచేయాలని నిర్ణయించుకుని అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బిఎస్‌పిలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు భగత్ సింగ్, కాటి మార్క్, బాజీ షరీఫ్, పుల్లయ్య, మహేంద్ర, కలామ్, చంటి, సుబ్బారావు, చిరంజీవి, దానియేలు పాల్గొన్నారు.

➡️