సూర్యలంకలో పర్యాటకుల సందడి

May 19,2024 22:24 ##Bapatla #Beach

ప్రజాశక్తి – బాపట్ల
మండలంలోని సూర్యలంక బీచ్‌లో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. ఎండ వేడి ఉక్కుపోతకు నుండి సేద తీరేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు సూర్యలంక సముద్ర తీరానికి విచ్చేశారు. ఆదివారం, వేసవి సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా పిల్ల పాపలతో రెండు తెలుగు రాష్ట్రాల నుండి పర్యాటకులు వచ్చారు. సముద్ర స్నానాలు ఆచరించే పర్యాటకులకు లోతుకు వెళ్లనివ్వకుండా పోలీసులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ భద్రతా చర్యలు చేపట్టారు.

➡️