సమతుల ఆహారంతో అదుపులో క్యాన్సర్

Feb 4,2024 22:10

ప్రజాశక్తి – బాపట్ల
సమతుల ఆహార నియమాలు పాటిస్తూ జీవనశైలి మార్పులతో క్యాన్సర్‌ను అదుపు చేయొచ్చని డాక్టర్ కొట్నీస్ జయంతి పురస్కార గ్రహీత ఎస్ శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన క్యాన్సర్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సదస్సుకు కె శ్రీహరిరావు అధ్యక్షత వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికీ, క్యాన్సర్ నివారణకు క్షారదేహతత్వ ఆహారం ప్రధానమని అన్నారు. ఆల్కలైన్ (క్షార తత్వ), ఎసిడిక్ (ఆమ్లతత్వ) సమతుల తత్వ ఆహారంతో క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు దరికిచేరవని అన్నారు. క్యాన్సర్ వ్యాధి సోకినట్లుగా తెలుస్తే భయానికి గురికాకుండా ముందు జాగ్రత్తతో క్యాన్సర్ వ్యాధి నుండి దూరం కావచ్చని అన్నారు. క్యాన్సర్ కణాల పెరుగుదలకు అవకాశం లేని వాతావరణాన్ని శరీరంలో సృష్టించడానికి క్షారతత్వ ఆహారం తీసుకోవాలని ఆధునిక వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారని అన్నారు. వైద్యుల సలహా మేరకు శరీర తత్వాన్ని గుర్తించి ఆహార నియమాలు పాటిస్తే క్యాన్సర్ వ్యాధికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. క్యాన్సర్ లక్షణాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే క్యాన్సర్ మహమ్మారి నుండి రక్షణ పొందొచ్చని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గండూరి వీరబ్రహ్మం, జివిసి సుబ్రహ్మణ్యం, బాబురావు, సింగారావు, జి శాంతారామ్, హరిప్రసాదరావు పాల్గొన్నారు.

➡️