క్రీస్తు జననం దివ్యసందేశం : అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్

Dec 25,2023 23:54

ప్రజాశక్తి – పంగులూరు
ఏసుక్రీస్తు ప్రపంచానికి ఇచ్చిన దివ్య సందేశం మానవాళికి శుభపరిణామని ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మండలంలోని జాగర్లమూడివారిపాలెం చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన సోమవారం పాల్గొన్నారు. ఒక సామాన్యుడిగానే సాటి మనిషికి సేవచేసి, కష్టాల్లో అక్కున చేర్చుకుని, సమాజసేవకు ఎలాంటి అధికారాలు అవసరం లేదని నిరూపించిన మానవతామూర్తి క్రీస్తు అన్నారు. సహనం, క్షమాగుణాలు ఎంత గొప్పవో చెప్పేందుకు తన రక్తం చిందించిన క్రీస్తు జన్మదినం పవిత్రమని కొనియాడారు. కరుణామయుడు లోక రక్షకుడుగా దివి నుంచి భువికి వచ్చిన శుభ సందర్భమే క్రిస్మస్ పండుగని అన్నారు. ఏసు క్రీస్తు ఆగమనమే ఒక దివ్య సందేశమని అన్నారు. విశ్వమానవ హితానికి శుభ సమయమని అన్నారు. క్రైస్తవ సోదర, సోదరీ మణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రిస్మస్ కేకు కట్ చేశారు. కార్యక్రమంలో స్థానిక సంఘ పెద్దలు, టిడిపి నేతలు పాల్గొన్నారు.

➡️