రోడ్డు ప్రమాద మృతులకు సిపిఎం నివాళి

Feb 17,2024 00:03

ప్రజాశక్తి – సంతమాగులూరు
మండలంలోని ఏల్చూరు గ్రామంలో గత బుధవారం ఆటోను కారు ఢీకొన్న ఘటనలో మృతి చెందిన మార్టూరు లక్ష్మమ్మ (60)కి సిపిఎం నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు నివాళి అర్పించారు. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. లక్ష్మమ్మకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త రెండేళ్ల క్రితమే మృతి చెందాడు. అప్పటి నుండి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుల్లో ఆటోడ్రైవర్ షేక్ అబ్దుల్ అల్లాహు ఉన్నారు. అతని కుటుంబం, పిల్లలు భార్యకు ఆధారం కోల్పోయిందని అన్నారు. ఆసుపత్రిలలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. గ్రామీణ ఉపాధి హామీ పనులు సక్రమంగా నిర్వహించకుండా, కూలీలకు పనులు కల్పించక పోవడం వల్ల వ్యవసాయ కార్మికులు ఉపాధి కోసం దూరప్రాంతాలకు ఆటోలపై వెళుతూ ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల వలసలను నిరోధించేందుకు ఉపాధి హామీ చట్టం వచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా పేదలకు ప్రభుత్వం గ్రామాల్లో ఉపాధి చూపించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు వేటగిరి మస్తాన్, కమలా దుర్గ, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కొప్పరం వలి పాల్గొన్నారు.

➡️