తుఫాను బాధితులను ఆదుకోవాలి : కమిషనర్‌కు సిపిఎం కార్యదర్శి సిహెచ్ మణిలాల్ వినతి

Dec 12,2023 00:15

ప్రజాశక్తి – రేపల్లె
జగనన్నకాలనీలో వర్షంనీళ్ల మధ్యలో నివాసం ఉంటున్న పేదలు అందరికీ రూ.2500నగదు, 25కేజీల బియ్యం, నిత్యవసరాలు పంపిణీ చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు సీపీఎం కార్యదర్శి సిహెచ్‌ మణిలాల్‌ సోమవారం వినతి పత్రం అందజేశారు. స్థానిక 18వార్డు సచివాలయం వద్ద తుపాన్ వల్ల తాము ఉపాధి కోల్పోయామని ప్రజలు తెలిపారు. ఇప్పటికీ వర్షం నీళ్లలోనే నివాసం ఉన్నామని నిరసన వ్యక్తం చేశారు. జిల్లా స్థాయిలో డీఎస్ఓ గారే రేపల్లె జగనన్న కాలనీలో అందరికీ నిత్యవసరాలు అందించామని చెబుతున్నప్పటికీ ఇక్కడ వర్షం నీటితో ఉన్నా వారికి అందలేదని అన్నారు. జగనన్న కాలనీలో కనీసం రోడ్లు లేకపోవడంతో మోకాళ్ళ లోతు వర్షం నీళ్లలో నడుస్తున్నారని తెలిపారు. సిఎం ప్రకటించిన పద్ధతుల్లో ఇప్పటికీ వర్షం నీటిలో నివాసం ఉంటున్న జగనన్న కాలనీ వాసులందరికీ నగదు అందించాలని లేకపోతే పేదలను కలుపుకొని ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు కెవి లక్ష్మణరావు, ఆగస్టన్, కె ఆస్విరథం, కె వెంకట్రావు, స్థానిక మహిళలు కె నాంచారమ్మ, ఆదిలక్ష్మి, పిచ్చయ్య, అనూష పాల్గొన్నారు.

➡️