బిజెపి ఓటమి ఇండియా కూటమి లక్ష్యం

Jan 7,2024 23:45

ప్రజాశక్తి – బాపట్ల
కేంద్రంలో బిజెపిని ఓడించడమే ఇండియా కూటమి ప్రధాన లక్ష్యమని సమాజవాది పార్టీ జిల్లా అధ్యక్షులు మేధా శ్రీనివాసరావు అన్నారు. ఇండియా కూటమి జిల్లా శాఖ తొలి సమావేశం పట్టణంలో ఆదివారం నిర్వహించారు. బీజేపీ పాలనలో పెరుగుతున్న ధరలు, మత విద్వేషాలతో సామాన్య ప్రజల్లో రాజకీయ అలజడి ఆర్థిక, కష్టాలు వెంటాడుతున్నాయని అన్నారు. బిజెపిని అంతం చేయాల్సిన పరిస్థితులను ప్రజలను గుర్తించాలని కోరారు. కాంగ్రెస్ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రాజేష్ పఠాన్ మాట్లాడుతూ దేశంలో బిజెపి అరాచకాలు సృష్టిస్తూ, కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతుందని అన్నారు. బిజెపి విధానాలను ప్రజలు తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. సమావేశంలో జేబీ శ్రీధర్, కనకారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు సాగర్, సమాజవాది పార్టీ నాయకులు మోర్ల చిన్న వెంకటేశ్వరరావు, లంబు సాంబయ్య, దర్శి భాస్కరరావు పాల్గొన్నారు.

➡️