నిత్యావసర సరుకులు పంపిణీ

Dec 5,2023 23:54

ప్రజాశక్తి – అద్దంకి
తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురియడంతో పట్టణం సమీపంలోని ఎన్టీఆర్ కాలనీలో పేదల పూరి గుడిసెల్లోకి నీరు చేరింది. విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు కోనేటి ఎంటర్ప్రైజెస్ అధినేత కోనేటి అనిల్, అతని సహచరులు 20వ వార్డులో దాదాపు 100కుటుంబాలకు సరిపడే నిత్యావసర వస్తువులను మంగళవారం అందజేశారు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, ఉన్న డ్రైన్లను పూడిక తీయక పోవడంతో పేదల ఇళ్లలోకి నీళ్లు చేరాయని ఆరోపించారు. ప్రతి కుటుంబానికి 5కేజీల బియ్యంతో పాటు కూరగాయలు, నూనె, కందిపప్పు, ఇతర వస్తువును అందించారు. కార్యక్రమంలో దుర్గా, వెంకట్రావు, రాజేష్, వహీద్ పాల్గొన్నారు.

➡️