గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ

Feb 8,2024 23:12

ప్రజాశక్తి – బాపట్ల
ప్రత్యేక వైద్య పరీక్షలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన గర్భిణీలకు జాతీయ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు దేవరకొండ రాము ఆధ్వర్యంలో గురువారం పండ్లు పంపిణీ చేశారు. వెదుళ్ళపల్లి పిహెచ్‌సిలో జరిగిన కార్యక్రమంలో పీహెచ్‌సి వైద్యాధికారులు డాక్టర్‌ మానస ప్రియదర్శిని, వైష్ణవ కృష్ణ, పిహెచ్‌సి సిబ్బంది డి ప్రసాద్, పి పద్మ, జి రేపకా, ఎన్‌టిఎఫ్ సభ్యులు ఉయ్యాల శివకామేశ్వరి, వి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

➡️