రాయితీపై పచ్చి రొట్ట విత్తనాల పంపిణీ

May 25,2024 00:41 ##agriculture #paddy #rice

ప్రజాశక్తి – వేమూరు
ప్రభుత్వం రైతులకు ఖరీఫ్ సీజన్‌కు గాను పచ్చిరొట్ట విత్తనాలు రాయితీపై అందించేందుకు సిద్ధం చేసినట్లు ఎఒ సిహెచ్ సునీత తెలిపారు. మండలంలోని జంపన గ్రామంలో శుక్రవారం 50శాతం రాయితీపై పిల్లి పెసర, జనుము విత్తనాలు అందజేశారు. అన్ని రైతు భరోసా కేంద్రాల్లో వీటిని రైతులకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. పిల్లి పెసర కేజీ రూ.67, జనుము కేజీ రూ.44 చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. బాపట్ల వనరుల కేంద్రం వ్యవసాయాధికారి ఆర్ విజయ రాజు మాట్లాడుతూ పచ్చిరొట్ట విత్తనాలను వెదజల్లిన అనంతరం 40రోజుల తర్వాత భూమిలో కలియదున్నాలని చెప్పారు. భూమిలో ఈ పైరు కుళ్లి భూసారాన్ని పెంచుతుందని తెలిపారు. రైతులు ప్రభుత్వం ద్వారా అందించబడే విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతు భరోసా కేంద్రాల విఎఎలు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
అద్దంకి : పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు ఎఒ కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు. జీలుగ 60క్వింటాళ్ళు, జనుములు 85క్వింటాల్లు, పిల్లి పెసర 50క్వింటాళ్ళు రైతు భరోసా కేంద్రాల్లో పంపిణీకి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. కావలసిన రైతులు 50శాతం రాయితీ పోను మిగతా సొమ్ము చెల్లించి విత్తనాలు పొందవచ్చని తెలిపారు. జీలుగ, జనుము 50శాతం రాయితీ పోను కేజీ రూ.44, పిల్లి పెసర పూర్తి 50 శాతం రాయితీ పోను రూ.67 చెల్లించాలని తెలిపారు.

➡️