పేటేరులో మిశ్రమ దానా పంపిణీ

Dec 8,2023 22:55

ప్రజాశక్తి – రేపల్లె
తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న తీరప్రాంత గ్రామాల్లో పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు వై కేదారేశ్వర్ సంపూర్ణ మిశ్రమ దానాను పేటేరు గ్రామంలో లబ్ధిదారులకు శుక్రవారం ఉచితంగా పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు కలెక్టర్ నిధి నుండి 15టన్నుల మిశ్రమ దానాలు కేటాయించినట్లు తెలిపారు. పాడి రైతులతో మాట్లాడి తుఫాన్ తరువాత పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. కార్యక్రమంలో సహాయ సంచాలకులు డాక్టర్ జి నరేంద్రబాబు, పేటేరు వైసిపీ ఇంఛార్జి కనపర్తి రవి కిరణ్, వైస్ ఎంపీపీ రావు నెహ్రూలక్ష్మీప్రభాకర్, బొబ్బర్లంక పశువైద్యాధికారి డాక్టర్ పి మీనాక్షిదేవి, డాక్టర్ ఎ ప్రవీణ్‌కుమార్, మోర్ల హరిత, గోపాలమిత్ర మోర్ల బాబురావు పాల్గొన్నారు.

➡️