విద్యార్ధులకు బహుమతుల పంపిణీ

May 22,2024 23:56 ##Addanki #Library

ప్రజాశక్తి – అద్దంకి
విద్యార్థినీ, విద్యార్థులు గ్రంథాలయాలను ఉపయోగించుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని గ్రంథ పాలకులు సుగుణరావు కోరారు. స్థానిక శాఖా గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించారు. క్విజ్, డ్రాయింగ్ పోటీలు 7వ రోజు బుధవారం నిర్వహించారు. ఫ్యాకల్టీగా సాయి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ వీర్రాజు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు బోధించారు. వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. శిబిరంలో 26 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

➡️