టిడిపి మేనిఫెస్టో కరపత్రాల పంపిణీ

Dec 3,2023 23:39

ప్రజాశక్తి – చీరాల
టిడిపి ఇన్చార్జి ఎంఎం కొండయ్య భవిష్యత్తు గ్యారెంటీ, ఊరురా వాడ కార్యక్రమాన్ని విఆర్ఎస్ కాలేజ్ సెంటర్ నందు నిర్వహించారు. ప్రసాద నగరం కాలనీలో పర్యటించి సదస్సు నిర్వహించారు. టిడిపి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు అండదండలు యిస్తుందని అన్నారు. మంచి పరిపాలన అందించే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యువ నాయకుడు ఎం అమర్నాథ్, విష్ణుమొలకల మధు, పెడవల్లి శంభు ప్రసాద్, అడ్డగడ్డ రామయ్య, పాకల శ్రీను, చుక్కా కోటయ్య, తేలప్రోలు నాగేశ్వరావు, కౌతరపు జనార్దనరావు, గంజి పురుషోత్తం, నందం లావణ్య పాల్గొన్నారు.


బాపట్ల : ఒక్కసారి గెలిపించి చూడండి. బాపట్లను అభివృద్ధి చేసి చూపిస్తానని టిడిపి ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. ఇంటింటికి టిడిపి, మీ మాటే – నా బాట, భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం పట్టణంలోని 9వ వార్డు ఎస్టి కాలనీలో నిర్వహించారు. మహిళలకు చీర, నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచి, తన గురించి తెలియజేసే కరపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు గొలపల శ్రీనివాసరావు, ముక్కముల సాంబశివరావు, కొల్లూరి వెంకట్రావు, ధార అశోక్, ఇనగంటి గాంధీ, ఫరీద్ మస్తాన్, సూరగని శేఖర్, హనుమాన్ పాల్గొన్నారు.

➡️