డాక్టర్ బాబురావు దంపతులకు సన్మానం

Dec 28,2023 00:31

ప్రజాశక్తి – చీరాల
పేరాల సెయింట్ మార్క్స్ చర్చ్ సండే స్కూల్ సుపర్నిడెంట్ బ్యులా లారెన్స్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా డాక్టర్ ఐ బాబురావు, సుభాషిణి దంపతులను బుధవారం ఘనంగా సత్కరించారు. చిన్ననాటి నుండే పిల్లలకు సండే స్కూల్ ద్వారా దేవుని మాటలను తెలియజేస్తూ ఆయన మార్గంలో నడవడానికి కృషి చేస్తున్న సండే స్కూల్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. వేడుకలకు తహశీల్దారు జె ప్రభాకరరావు, డాక్టర్ ఐ బాబురావు, యడం రవిశంకర్, సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ కె జోసఫ్ కెరీ, పిసిసి చైర్మన్ డి అశోక్ కుమార్, ట్రెజరర్ పి ఆనంద్ బాబు, కో ఆప్షన్ సభ్యులు డి అజయ్ కుమార్ హాజరయ్యారు. బాలుడు నడవ వలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైన దాని నుండి తొలగిపోడు అన్న బైబిల్ మాటలు నేడు చిన్నారులకు ఎంతో అవసరం అన్నారు. అతిధులకు బ్యూలా లారెన్స్ ఆధ్వర్యంలో శాలువా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.

➡️