తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలి

May 29,2024 22:55 ##Addanki #Mpp

ప్రజాశక్తి – అద్దంకి
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఎంపిపి అవిశన జ్యోతి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. సమావేశంలో ఎంపిడిఒ సత్యనారాయణ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా అన్ని గ్రామాల్లో తాగు నీటి సమస్య లేకుండా పిడబ్లయూ శాఖ, సంబందించిన అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామి పనుల్లో కూలీలకు పని కల్పించాలని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నందున ఆయా శాఖల అధికారులు తమ శాఖల పనితీరును మాత్రమే వివరించారు. ఎంఇఒ గంగాధర్ మాట్లాడుతూ జూన్ 12న పాఠశాలలు ప్రారంభం అవుతాయని చెప్పారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యా కానుక కిట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. తల్లి, దండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. 2023-24 విద్యా సంవత్సరంలో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10తరగతి చదివిన విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️