పూలే ఆశయ సాధనకు కృషి జరగాలి

Apr 11,2024 23:29 ##Ambedkar #Jyothiraopule

ప్రజాశక్తి – బాపట్ల
సామాజిక అసమానతలపై పోరాడిన వారిలో మహాత్మా జ్యోతిరావుపూలే అగ్రగణ్యులని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు సిహెచ్ గంగయ్య అన్నారు. పూలే 197వ జయంతి సందర్భంగా స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ దేశంలో అట్టడుగు, నిమ్నజాతి వర్గాల, జాతుల కోసం, అసమానతలు పోగొట్టాలని కృషి చేసిన తొలి సామాజిక ఉద్యమ నేత మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. సామాజిక ఉద్యమనేతగా కీర్తిగాంచిన మొట్ట మొదటి మహాత్మా బిరుదాంకితులు పూలే అని అన్నారు. చదువు ద్వారానే సమాజంలో అంటరానితనం రూపుమాప గలమని కృషి చేసిన మహనీయుడని అన్నారు. మహిళా సాధికారత, మహిళా హక్కులు, విద్య, ఉపాధి, గౌరవం కోసం పోరాడిన దార్శనికులని అన్నారు. మహిళా విద్య కోసం తన భార్య సావిత్రిబాయికి చదువు చెప్పించి మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయినిగా ప్రోత్సహించారని అన్నారు. దేశంలో నేటికి వివిధ రూపాల్లో కొనసాగుతున్న అంటరానితనం, కుల సమస్యపై పోరాటాల్లో పూలే స్పూర్తితో నేటి యువత ఐక్యంగా ముందుకెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు, యుటిఎఫ్, వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా ప్రజాసంఘాల నేతలు ఎ శ్రీనివాసరావు, వినయ్ కుమార్, సిహెచ్ మజుందార్, టి కృష్ణమోహన్, నూతలపాటి కోటేశ్వరావు, కుమార్, కె నాగేశ్వరావు, సుభాషిని పాల్గొన్నారు.

సమాజంలో నెలకొన్న సామాజిక రుగ్మతలను తరిమికొట్టేందుకు జ్యోతిరావు పూలే ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని సమాజ్ వాది పార్టీ జిల్లా అధ్యక్షులు మేధా శ్రీనివాసరావు అన్నారు. గురువారం పూలే జయంతి సందర్భంగా స్థానిక మేధా కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పూలే చిత్రపటానికి పూలమాల వేసే ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో బాపట్ల సాల్వేషన్ ఆర్మీ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్యామ్ లివింగ్ స్టన్, బీసీ నాయకులు మద్దిబోయిన తాతయ్య, పిన్నిబోయిన వెంకటేశ్వర్లు, మొర్ల చిన్న వెంకటేశ్వరరావు, బోయిన సూరిబాబు, దర్శి భాస్కరరావు, కొమ్మనబోయిన ఫణి కుమార్, న్యాయవాది అంగలకుదురు నటరాజన్, కాండ్రు శరత్ కుమార్, రవికుమార్ పాల్గొన్నారు.

జ్యోతీరావు పూలే 197వ జయంతి వేడుకలను టిడిపి ఆధ్వర్యంలో స్థానిక చీలు రోడ్డు సెంటర్లో ఘనంగా నిర్వహించారు. పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎంఎల్‌ఎ అభ్యర్థి నరేంద్ర వర్మ తనయుడు వేగేశన రాకేష్ వర్మ, జనసేన ఇన్‌ఛార్జి నామన శివన్నారాయణ పాల్గొన్నారు.

సంతమాగులూరు : స్థానిక శాఖా గ్రంధాలయంలో గ్రంథ పాలకులు బాదం విజయభాస్కరరెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలదండలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

అద్దంకి : మహాత్మ పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ స్థానిక బంగ్లా రోడ్డులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహాత్మ పూలే 197వ జయంతి సందర్భంగా పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు అంకం కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క కాంతారావు, జై భీమ్ మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గోపతోటి శాంసన్ మాట్లాడారు. కార్యక్రమంలో స్వర్ణ వంశీకృష్ణ (సోనీ), శ్రీనివాసరావు, నూతలపాటి హనుమంతరావు, కొంగల శ్రీనివాసరావు, దార్ల శ్రీనివాసరావు, ఏబు, యర్రమోతు నాగయ్య, నల్లగుండ్ల శ్రీనివాసరావు, నాగరాజు, కొండ్ర వీరాంజనేయులు (పంతులు), తిప్పాబత్తిన వెంకట్రావు, అశోక్, బేతాళ పూర్ణచంద్రరావు, పులి వికాస్, సాంబశివరావు, వీరు, బాబురావు, అంకమ్మరావు, కోటేశ్వరరావు, గురవయ్య, మల్లెల హనుమంతరావు పాల్గొన్నారు.
ఇంకొల్లు రూరల్‌ : మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి ఘనంగా నిర్వహించారు. స్థానిక అంకమ్మ కాలనీలో జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎంఎస్‌పి జిల్లా కో కన్వీనర్ పల్లెపాగు నాని మాదిగ, ఎడ్లూరి ప్రసాద్ (దాసు) పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కోడూరి హరీష్, ఏజర్ల ప్రవీణ్‌, బౌతుల రాజేష్, పల్లెపాటి బాబు మాదిగ, కారుమూరి రాజేష్, ఏజర్ల రవీంద్ర, పల్లపాటి సుధాకర్ పాల్గొన్నారు.

రేపల్లె : మహాత్మా జ్యోతిరావుపూలే 197వ జయంతిని సీపీఎం కార్యాలయంలో ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. పూలే చిత్రపటానికి సీపీఎం, ప్రజా సంఘాలు నాయకులు వై కిషోర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సీపీఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడారు. దేశంలో అట్టడుగు వర్గాల, జాతుల కోసం అసమానతలు పోగొట్టాలని కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. చదువు ఒక్కటే అసమానతలు మార్చగలదని భావించే అక్షరాస్యతపై దృష్టి పెట్టారని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం, ప్రజాసంఘాలు నేతలు కెవి లక్ష్మణరావు, వై కిషోర్, కె ఆశ్విరాధం, యు నాంచారయ్య పాల్గొన్నారు.

రేపల్లె : మహాత్మ జ్యోతిరావు పూలే త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను భావితరాలకు తెలియచేయాల్సిన అవసరం ఉందని ఎంఎల్‌ఎ అనగాని సత్యప్రసాద్ అన్నారు. మహాత్మ జ్యోతిరావ్ పూలే 197వ జయంతి నిర్వహించారు. సామాన్యుడిగా మొదలై ఒక సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఫూలే జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే స్ఫూర్తితోనే పాలకులు వినూత్న కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. మహిళల సాధికారతకు పూలే సరికొత్త నినాదంతో పోరాటాలు చేశారని అన్నారు.

భట్టిప్రోలు : సంఘసంస్కర్త, సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలని వైసిపి అభ్యర్థి వరికూటి అశోక్ బాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని సూరేపల్లెలో ఆయన జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ డివి లలిత కుమారి, జడ్పిటిసి టి ఉదయ్ భాస్కరి, సర్పంచ్ మోర్ల విజయలక్ష్మి, గోవర్ధనగిరి శేషాచల శ్రీనివాసరావు, మోర్ల సత్యనారాయణ, బాలాజీ, మల్లేశ్వరరావు, పడమటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️