విద్యుత్తు విజిలెన్స్ తనిఖీలు

Jan 13,2024 00:49

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్తు విజిలెన్స్ అధికారుల బృందాలు శుక్రవారం తనిఖీలు చేశారు. గుంటూరు విజిలెన్స్ డిప్యూటీ డైరెక్టర్ పివి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో జరిగిన తనిఖీలలో 5588 సర్వీసులను 70బృందాలుగా విడిపోయి తనిఖీ చేశారు. వీటిలో 148 విద్యుత్తు మీటర్లు అధిక లోడుతో వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీనికి గాను రూ.6.20లక్షల అపరాధ రుసుం విధించినట్లు రేపల్లె ఎడిఎ నెమలకంటి భాస్కరరావు తెలిపారు. విద్యుత్తు చౌర్యం సామాజిక నేరమని అన్నారు. విద్యుత్తు తనిఖీల్లో బయటపడితే అట్టి వాటిపై అపరాధ రుసుం విధించడమే కాక చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు విజిలెన్స్ అధికారి మల్లికార్జునరావు తెలిపారు. పరిమితికి లోబడే విద్యుత్‌ వినియోగించుకోవాలని అన్నారు.

➡️