ఏలూరి సుడిగాలి పర్యట

Mar 30,2024 23:27 ##Eluri #Tornado #Tour

ప్రజాశక్తి – కారంచేడు
ఎంఎల్‌ఎ ఏలూరు సాంబశివరావు మండలంలో విస్తృతంగా శనివారం పర్యటించారు. మండలంలోని స్వర్ణ, తిమిడిదపాడు, దగ్గుబాడు గ్రామాల్లో కార్యకర్తలను కలుసుకున్నారు. స్వర్ణ గ్రామంలో టిడిపి కార్యకర్త సోమిశెట్టి శ్రీకాంత్ కుమార్తె ఇటీవల డాబాపైనుంచి పడటంతో ఆయన నివాసంకి వెళ్ళి గాయపడ్డ ఆమెను పరామర్శించారు. అనంతరం గ్రామంలో చింతపల్లి హనుమంతరావు భార్య శివమ్మ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల మరణించిన తోట నాగమల్లేశ్వరరావు నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఎస్సీ కాలనీలో పర్యటించారు. బండి కృష్ణను పరామర్శించారు. తిమిడిత్తిపాడు గ్రామానిక చెందిన శిరిమల రాజేష్ చిత్రపటానికి నివాళి ర్పించారు. ఎస్సీ కాలనీలో కంభంపాటి అక్కమ్మను పరామర్శించారు. దగ్గుబాడులో మాజీ ఎంపీటీసీ ముల్లా మబ్బుల్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఆయన వెంట టిడిపి నాయకుడు తిరుమల శెట్టి శ్రీహరి ఉన్నారు.

➡️