భూసేకరణపై గ్రామసభ

Mar 14,2024 23:58

ప్రజాశక్తి – కారంచేడు
వాడరేవు – పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణపై స్థానిక పంచాయతీ వద్ద గురువారం గ్రామ సభ నిర్వహించారు. సభకు చీరాల ఆర్డీఒ సూర్యనారాయణరెడ్డి హాజరయ్యారు. వాడరేవు – పిడుగురాళ్ల జాతీయ రహదారి 167ఏ కింద కారంచేడు పరిదిలో భూములు నష్టపోయిన 12.4 ఏకరాల రైతుల పేర్లను, పొలాల విస్తీర్ణంతో కూడిన సమాచారాన్ని గ్రామ సభలో వివరించారు. జాతీయ రహదారి నిర్మాణం చట్టం ప్రకారం రైతులకు నష్టపరిహారం ఎంత మంజూరు అవుతుందో వివరాలను తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దారు మోహర్ కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

➡️