ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Mar 7,2024 22:59

ప్రజాశక్తి – భట్టిప్రోలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక కెఎస్‌కె మహిళా జూనియర్ కళాశాల్లో సంబరాలు నిర్వహించారు. వెల్లటూరు పిహెచ్‌సి డాక్టర్‌ సిహెచ్ రామలక్ష్మిని ఘనంగా సత్కరించారు. సిఐటియు, యుటిఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఐద్వా రాష్ట్ర నాయకులు పద్మ మాట్లాడారు. మహిళా హక్కులను వివరించారు. మహిళలు, పురుషులతో పాటు సమాన హక్కులు పొందేందుకు మహిళ దినోత్సవం స్పూర్తి కావాలని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషుల కంటే దీటుగా మహిళలంతా ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మండల సమైక్య ఆధ్వర్యంలో మహిళ దినోత్సవం నిర్వహించారు. ఐలవరం జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో ఐసిడిఎస్, సచివాలయాల సిబ్బంది ఆయా రంగాల్లో పనిచేసే మహిళలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జడ్పిటిసి తిరివీధుల ఉదయభాస్కరి, ఎంపీపీ డివి లలిత కుమారి, సర్పంచ్ ద్వారా రవికిరణ్మయి, ఎంపీటీసీలు, సర్పంచులు, మహిళా కార్యదర్శిలు, అంగన్‌వాడి సూపర్వైజర్లు, కార్యకర్తలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

➡️