కోనేటి పురంలో ఆరోగ్య సురక్ష శిబిరం

Jan 13,2024 00:52

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని కోనేటపురం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం శుక్రవారం నిర్వహించారు. రోగులకు వివిధ రకాల పరీక్షలు చేశారు. నలుగురు వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. సర్పంచ్ మార్ల కోటేశ్వరమ్మ వైద్య శిభిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో 300మందికిపైగా రోగులకు వైద్యులు పరీక్షలు చేసినట్లు డాక్టర్‌ రామలక్ష్మి తెలిపారు. శిబిరాన్ని ఎంపీపీ డివి లలితకుమారి, జడ్పిటిసి టి ఉదయ్ భాస్కరి, మండల ఉపాధ్యక్షులు మల్లొలు, తహశీల్దారు ధూళిపూడి వెంకటేశ్వరరావు, ఎంపీడీఒ గుమ్మా చంద్రశేఖర్, వైసీపీ మండల కన్వీనర్ మార్ల శ్రీనివాసరావు, మల్లేశ్వరరావు, బాలాజీ పర్యవేక్షించారు.

➡️