చిరుధాన్యాల కషాయంతో వరిలో అధిక దిగుబడులు

Nov 23,2023 00:10

ప్రజాశక్తి – భట్టిప్రోలు
దుకాణాల్లో లభ్యమయ్యే చిరుధాన్యాలతో కషాయాన్ని తయారుచేసి గింజ పాలు పోసుకునే వరి పైరిపై పిచికారి చేస్తే అధిక దిగుబడులు లభిస్తాయని ప్రకృతి వ్యవసాయ క్లస్టర్ ఇంచార్జ్ గుర్రం పాండురంగారావు సూచించారు. క్లస్టర్ సిబ్బందితో గురువారం ప్రయోగం చేశారు. 100గ్రాముల నువ్వులు 12గంటలు నాన పెట్టాలని తెలిపారు. 100గ్రాముల గోధుమలు, 100గ్రాముల మినుములు, 100గ్రాముల పెసలు, 100గ్రాముల బొబ్బర్లు, 100గ్రాముల ఉలవలు తీసుకొని వాటిని కూడా మరో 12గంటలు నానబెట్టాలని తెలిపారు. అనంతరం మొత్తం కలిపి రూబీ దానిలో పది లీటర్ల పశువుల మూత్రాన్ని కలిపి పులియబెట్టిన తర్వాత ఎకరా ఈనెక దశలో ఉన్న వరి పైరుపై పిచికారి చేస్తే తాలు గింజలు రాకుండా నాణ్యమైన గింజలతో అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీఏ, సీఆర్పీలు ఉన్నారు.

➡️