మళ్లీ బిజెపి వస్తే భవిష్యత్ అగమ్యగోచరం

Jan 1,2024 00:30

ప్రజాశక్తి – పర్చూరు
కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకి వస్తే ఏపీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉందని కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక కమ్యూనిటీ హాల్లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల విసృత సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎపికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో టిడిపి, వైసిపి ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అన్నారు. కేంద్రం ప్రభుత్వంతో పోరాడి విభజన చట్టంలోని అంశాలను సాధించడంలో గత ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూప లేదన్నారు. మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలనే నినాదంతో వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ ప్రజలకు చేరువయ్యేలా దృష్టి సారించమని అన్నారు. పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్‌ను వీడిన వాళ్లంతా తిరిగి రావాలని ఆహ్వానించారు. టిడిపి, వైసిపి, జనసేన నాయకులు అందరూ మోడీ శిష్యులేనని అన్నారు. రాముడిని అడ్డుపెట్టుకొని ప్రధాని మోడీ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో మోడీ చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గంటా అంజిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట శివనాగేశ్వరరావు, పిసిసి ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, వేమూరు ఇంచార్జీ వెంకటేశ్వరరావు, పర్చూరు ఇంచార్జ్ జానకి రామయ్య, పులిపాటి రవి, కంభం మార్క్, పోతిన సంపత్ పాల్గొన్నారు.

➡️