నిధులు దుర్వినియోగంపై విచారణ

Dec 2,2023 01:05

ప్రజాశక్తి – కారంచేడు
స్థానిక పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై అధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. 2019నుంచి 2023వరకు ప్రత్యేక అధికారుల కాలంలో, పాలక వర్గం ఏర్పడిన తర్వాత నిధుల దుర్వినియోగం జరిగిందని, వ్యక్తిగతంగా వాడుకున్నారని 7వ వార్డు సభ్యురాలు ఆదిలక్ష్మి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో అధికారులు విచారణ చేస్తున్నారు. గతంలో రెండేళ్ల ప్రత్యేక అధికారుల కాలంలో అప్పటి కార్యదర్శి నిధులను వివిధ రకాల పనులు చేసినట్లుగా చూసి కొంత మంది అకౌంట్లలో వేసి దుర్వినియోగం చేశారని సర్పంచ్ బాలిగ శివ పార్వతి అప్పట్లో ఆందోళన చేశసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఫిర్యాదుపై ఇప్పటికి మూడుసార్లు అధికారులు విచారణ చేశారు. కానీ నిధుల దుర్వినియోగం తేల్చలేకపోయారు. ప్రస్తుతం చీరాల డిఎల్పిఓ దారా హనుమంతరావు ఆధ్వర్యంలో నలుగురు అధికారులు తాజాగా విచారణ చేశారు. తమ విచారణ నివేదికను కలెక్టర్‌కు అందిస్తామని, తదుపరి చర్యలు కలెక్టర్ తీసుకుంటారని చెప్పారు. విచారణలో పంచాయతీ కార్యదర్శులు మస్తాన్‌రావు, హరిప్రసాద్, దేశాయిపేట జూనియర్ అసిస్టెంట్ కోటేశ్వరరావు పాల్గొన్నారు

➡️