స్కానింగ్‌ సెంటర్ల తనిఖీ

Mar 27,2024 23:49 ##repalle #Scancenter

ప్రజాశక్తి – రేపల్లె
పట్టణంలోని ప్రైవేటు స్కానింగ్ సెంటర్లను డాక్టర్ ఎస్ రమేష్, డాక్టర్ ఆర్ జాన్ ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది బుధవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డేకాయ్ ఆపరేషన్ నిర్వహించటంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు వారితోపాటు ఒక అటెండెంట్‌కు, ఆశా కార్యకర్తలకు ముందస్తు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో స్కానింగ్‌ సెంటర్‌లు, ల్యాబ్‌లు, అనుమతులు లేకుండా నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. గర్భిణులు ప్రభుత్వ సెంటర్లలోనే స్కానింగ్ చేయించుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డయాగ్నోస్టిక్ సెంటర్, రేడియాలజీ, మెమోగ్రమీ ఉచిత సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల ఆవరణలో హెల్త్ క్యంపులు నిర్వహిస్తే బాగుంటుందని పేర్కొన్నారు.

➡️